telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ మార్పులో జనసేన భాగస్వామ్యం అవుతుంది : కిషన్ రెడ్డి

Kishan Reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు.. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ హాజరయ్యారు. అనంతరం గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ఇస్తుంది అని పవన్ తెలిపారు. ఆ తర్వాతకిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో బీజేపీ మోడీ న్యాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గ్రేటర్ లో అది కనిపిస్తుంది. వరదలు లేని మురికి రాని ఇల్లు కావాలని అవినీతి లేని పాలన కావాలని కోరుకుంటున్నారు అని అన్నారు. మంచి అవినీతి లేని పాలన కావాలి గులాబీ గ్రాఫిక్స్ కాకుండా ప్రాక్టికల్ అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు అని తెలిపారు. అది బీజేపీ తోనే సాధ్యం అనే విశ్వాసం కనిపిస్తోంది. ఇదే హైదరాబాద్ ఎక్కడ పోయిన కనిపిస్తుంది.  జనసేన కూడా కలిసి మాతోకలిసి రావాలని కోరాం. పవన్ కూడా బీజేపీ విజయం కోసం పని చేస్తామన్నారు అని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు మార్పు తీసుకుని వస్తారు. ఈ మార్పులో జనసేన భాగస్వామ్యం అవుతుంది అని కిషన్ రెడ్డి అన్నారు.

Related posts