telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజిఎఫ్-2 : క్రూరత్వానికి అధినేత్రి ఆమె… రవీనా టాండన్ లుక్ విడుదల

KGF-2

కన్నడ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ “కేజిఎఫ్-2”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలుగులో వారాహి చలన చిత్రం వారు గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా… ర‌వి బ‌స్రూర్ సంగీతం సమకూర్చుతున్నారు. రవీనా టండన్‌ మరో కీలకపాత్ర పోషిస్తోంది. భారీ యాక్షన్ మూవీ నుంచి హీరోయిన్ రవీనా టాండన్ పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు (అక్టోబర్ 26) రవీనా పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. కేజిఎఫ్ చాప్టర్ 2లో రమికా సేన్‌ అనే పొలిటీషియన్‌ పాత్రలో సీనియర్ నటి రవీనా టాండన్ నటిస్తోందని చెప్పారు. ‘క్రూరత్వానికి అధినేత్రి, పవర్‌ హౌస్‌ రమికా సేన్‌’కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో ర‌వీనా ఎర్ర‌టి చీర ధ‌రించి అసెంబ్లీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పోషిస్తున్న ఈ పవర్‌ఫుల్ రోల్, స్పెషల్ పోస్టర్ సినిమాపై ఇప్పటికే ఉన్న ఆతృతను మరింత పెంచేశాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts