telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్య ‘లవ్ స్టోరి’ కి భారీ డిమాండ్

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరి’ పేరుతో తెరకెక్కిస్తోన్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవ్వుతూ అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది.

Related posts