telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు మరో షాక్ : అర్ధరాత్రి మరో మాజీ ఎమ్యెల్యే అరెస్ట్

TDP-flag

టిడిపి పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే టిడిపి కీలక నేతలను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. తాజాగా మరోసారి టిడిపికి షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. టిడిపి కార్యకర్తల్లో భయాందోళనలు, సృష్టించేందుకే పోలీసుల అత్యుత్సాహం చేస్తున్నారని జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అర్ధరాత్రి జనార్దన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పోలీసుల వాహనాలను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. చివరికి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి డోను పీఎస్ కు తరలించారు పోలీసులు. జనార్దన్ రెడ్డిపై IPC 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.

Related posts