telugu navyamedia
సినిమా వార్తలు

డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్

ప్రస్తుతం కరోనా నేప‌థ్యంలో ఓటీటీ సంస్థల హవా న‌డుస్తోంది. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేని విదంగా ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు పరుగుపెడుతున్నాయి. ప్రతీ భాషలోని కంటెంట్‌పై ఓటీటీ దృష్టి పెడుతోంది. స్టార్‌ హీరోల సినిమా హక్కులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఇవి కాకుండా ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ కప్ 2021ను కూడా తెలుగు వారికి అందిస్తోంది.

Watch: Ram Charan's magic for Disney Hotstar

ఈ క్రమంలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులోకి రాబోతోంది… డిస్నీ హాట్ స్టార్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోన్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేయనున్నారు.

డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు డిస్నీ హాట్ స్టార్ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్దం చేసింది. టాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అంతేకాకుండా వీవో ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ కప్ 2021ను కూడా తెలుగు వారికి అందిస్తోంది.

Ram Charan turns magician, introduces Disney+ Hotstar to Telugu audiences  as 'Mana Vinoda Vishwam'

కాగా.. ‘ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్‌, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్‌లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్‌తో డిస్నీ హాట్ స్టార్ అలరిస్తుందని నమ్ముతున్నాను’  అని డిస్నీ హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ చెప్పారు.

Related posts