గత కొన్ని రోజులుగా కౌశల్ కు, కౌశల్ ఆర్మీ వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాడంటూ కొంతమంది కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియా వేదికగా ఆరోపణలు చేయడం, కౌశల్ కూడా మీడియా ముందుకు వచ్చి అవన్నీ అసత్యపు ఆరోపణలని తెలపడం, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ను కొన్ని రోజులపాటు నిలిపివేస్తున్నట్టు కౌశల్ ప్రకటించడం మొదలైనవన్నీ తెలిసిన విషయాలే. తాజాగా కౌశల్ పై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ “అందరూ గొర్రెలే…” అనే సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. చెన్నైకి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఈ పాటను విడుదల చేశారు. “అందరూ గొర్రెలే… అంటూ మొదలైన ఈ పాటలో” అన్న అనుకుంటే పీఎమ్ కాల్ వస్తద… సీఎం సీటు వస్తది … టెన్త్ పాస్ కాకున్నా డాక్టరేట్ వస్తది” అంటూ విమర్శలను సంధించారు. మరి ఈ వీడియో సాంగ్ పై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
previous post