తెలుగు ప్రేక్షకులకు అల్లుడు శ్రీను సినిమాతో పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తన మొదటి సినిమా నుంచే గొప్ప నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనదైన కథల ఎంపికతో తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రియల్ హీరో బిరుదు అందుకున్న సోనూ సూద్ కూడా కనపించనున్నాడు. ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమాన్యుయల్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే న్యూఇయర్ సందర్బంగా ఓ పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమా జనవరి 15 కు రానున్నట్లు తెలిపారు. కానీ తాజాగా సినిమా విడుదల తేదిని ఒక్క రోజు ముందుకు తీసుకోచ్చారు. జనవరి 14నే ఈ సినిమా విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. అయితే అదే రోజు రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా విడుదల అవుతుంది. రెడ్ కు పోటీగా వచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా… రామ్ రెడ్ పోటీని తఱుకొని నిస్తుందా అనేది చూడాలి మరి.
previous post