telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్తర జెండా ఫుల్ సాంగ్ రిలీజ్..

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.రాజమౌళి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం​ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది.

ఈ మూవీ నుంచి వారానికో ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ సినీ అభిమానుల్ని అలరిస్తోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం. ఇప్పటికే ‘నాటు నాటు’, ‘కొమ్మా ఉయ్యాలా’, ‘దోస్తీ’ వీడియోలు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా .. సత్తువ ఉరిమితే కొట్టర కొండా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.’

RRR: 'Ethara Jenda' Anthem Starring Alia Bhatt, Jr NTR & Ram Charan Dropped Ahead Of Film's Release

మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్, తారక్ మధ్యలో అలియా తమదైన డాన్స్ స్టెప్పులతో దుమ్ము లేపేయగా చివరన చిత్ర బృందం మొత్తం సాంగ్ లో స్టెప్స్ వేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది. అజయ్ దేవగన్, హాలీవుడ్ భామ ఒలివియాతో పాటు రాజమౌళి కూడా డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు.

రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈపాటకు ఎమ్‌ ఎమ్‌ కీరవాణి స్వరాలు అందించగా.. విశాల్‌ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు ఆలపించారు.

Related posts