telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్‌ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌( రౌద్రం.. రణం.. రుధిరం). ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర‌యూనిట్‌.

ఇటీవ‌ల ఈ సినిమా నుంచి రిలీజ్ ఆయిన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ పేరుతో తారక్‌, చెర్రిలకు సంబంధించిన ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

RRR MOVIE NAATU NAATU SONG

ఇందులో రామ్​చరణ్, ఎన్టీఆర్.. ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ ఓ రేంజ్ లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Naatu Naatu: Second lyrical video from Jr NTR, Ram Charan's 'RRR' out; goosebumps guaranteed | Telugu Movie News - Times of India

ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు.అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాపంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts