telugu navyamedia
సినిమా వార్తలు

మా కుటుంబ సభ్యులందరికీ ఇదే నిజమైన పండుగ..

పండ‌గ వేళ మెగా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌..ప్ర‌మాదం త‌రువాత‌ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కెమెరా ముందుకి వచ్చాడు..మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడు తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సాయి ధరమ్ తేజ్‏ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది… ఆ తర్వాత జూబ్లి హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇక ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేజ్.. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే తేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా . .” అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‏తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

అందులో అందులో మెగాస్టార్‌ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నారు.

దీనిపై సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అని సాయి ధరమ్‌ తేజ్ ట్వీట్‌ చేశారు.

Related posts