telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : శ్రీముఖిపై వరుణ్ ఫైర్… వెక్కివెక్కి ఏడ్చిన శ్రీముఖి

Bigg-Boss

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజులు (ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఈ వారం శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి ల‌లో ఒక‌రు ఇంటి నుండి వెళ్ళ‌నున్నారు. ఎపిసోడ్ 52లో ఇంటి స‌భ్యుల‌కి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ స‌క్ర‌మంగా పూర్తి చేయ‌ని కార‌ణంగా పున‌ర్న‌వి, శ్రీముఖి, మ‌హేష్‌ల‌కి బిగ్ బాస్ శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎనిమిదో వారంలో శివ‌జ్యోతికి ప‌లు సూచ‌న‌లు ఇచ్చింది శ్రీముఖి. వాటిని త‌ప్ప‌క పాటిస్తాన‌ని అంది. ఇక హిమ‌జ మూడు రోజులుగా మూడీగా ఉండ‌డంపై ఆమెని ప్ర‌శ్నించింది శివ‌జ్యోతి. దీనికి స‌మాధానం ఇచ్చింది. అనంతరం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ స‌క్సెస్‌ఫుల్‌గా ఆడితే స్పెష‌ల్‌ డిన్న‌ర్ ట్రీట్ ఉంటుంద‌ని చెప్పారు. దీంతో ఇంటి స‌భ్యులు అంద‌రు డిన్న‌ర్ ట్రీట్ కోసం గేమ్‌పై చాలా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చారు.

ఎపిసోడ్ 55లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యులకి సీక్రెట్స్ అండ్ లైస్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఇంటి స‌భ్యులు క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్లి అక్క‌డ జ‌రిగిన విష‌యాలు బ‌య‌ట‌కి వ‌చ్చి చెబుతారు. వారు క‌రెక్ట్ చెబుతున్నారా లేదంటే రాంగ్ చెబుతున్నారా అనేది స‌రిగ్గా గెస్ చేస్తే ఇంటి స‌భ్య‌లుకి స్పెష‌ల్ డిన్న‌ర్ ట్రీట్ ఉంటుంద‌ని బిగ్ బాస్ తెలిపారు. ముందుగా బాబా భాస్కర్ కన్ఫెష‌న్ రూంకి వెళ్ళ‌గా , ఆయ‌న‌ని 1,2,3ల‌తో పాటు ఏ, బీ, సీ,డీలు చెప్ప‌మని అంటాడు బిగ్ బాస్. ఇదే విష‌యాన్ని బ‌య‌ట‌కి వ‌చ్చి చెప్ప‌గా అంద‌ర‌కు నిజ‌మే చెప్పాడ‌ని గెస్ చేస్తారు. ఇలా క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్లి వ‌స్తున్న ఇంటి స‌భ్యులు చెప్పే మాట‌లు అన్నీ స‌రిగ్గా గెస్ చేసిన శ్రీముఖి. రాహుల్ విష‌యంలో బోల్తా కొట్టింది . దీని వ‌ల‌న అంద‌రి ముందు కాస్త బ్యాడ్ కూడా అయింది. ఇదే సందు అనుకొని వ‌రుణ్ ఆమెపై క‌స్సుబుస్సులాడాడు. దీని వ‌ల‌న శ్రీముఖి తెగ ఏడ్చేసింది. మేట‌ర్ ఏంటంటే కన్ఫెష‌న్ రూంలోకి వెళ్లిన రాహుల్ .. నాకు మా అమ్మ కాల్ చేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పింది. ఇంట్లో కొంచెం మంచిగా ఉండ‌మ‌ని గ‌ట్టింగా చెప్పింద‌ని అమ‌యాక‌పు ఫేస్ పెట్టి చెప్పాడు.

రాహుల్ చెప్పిన విష‌యం క‌రెక్ట్ అని అంద‌రి కంటే ముందు శ్రీముఖి బ‌ల్లగుద్ది చెప్పింది. అంతే కాదు హార్ట్ బీట్ విని అది క‌రెక్ట్ అంటూ అంద‌రిని త‌న రూట్‌లోకి తీసుకొచ్చేసింది. మొద‌ట అది అబ‌ద్దం అన్న వాళ్ళు కూడా శ్రీముఖి మాట‌ల‌కి నిజం అని న‌మ్మేశారు. మొద‌ట ముగ్గురు మాత్ర‌మే నిజం అన‌డంతో ..నేను చెప్తున్నాగా.. మీరు అబద్ధం అనుకుంటే మనకు బొక్కపడుతుందని గ‌ట్టిగా శ్రీ అనడంతో అనుమానంగా ఇంటి సభ్యులు నిజమే అని చేతులు ఎత్తారు. అయితే ఆమె అంచనా తప్పిందని బిగ్ బాస్ చెప్పడంతో ఆమె అన్నట్టుగా నిజంగానే బొక్కపడింది. ఇక వ‌రుణ్‌.. శ్రీముఖికి చిన్న పాటి క్లాస్ పీకాడు. మొద‌ట నుండి చూస్తున్నాను నువ్వు అంద‌రిని డామినేట్ చేస్తావు. బొక్క ప‌డుతుంది అనే స‌రికి అంద‌రు సొంత స్టాండ్ తీసుకోలేక‌పోయారు అంటూ ఆమెపై ఫుల్ సీరియ‌స్ అయ్యాడు. దీనికి శ్రీముఖి బొక్క ప‌డుతుంది అనే ప‌దం నా స్టైల్‌లో నేను ఉప‌యోగించేంది. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. క‌త్తి మెడ మీద పెట్టి వారిని నేను ఫోర్స్ చేయ‌లేదు క‌దా అని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఇలా కొద్ది సేపటి వ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. వితికా కూల్ చేసే ప్ర‌య‌త్నం చేసిన వారు ఆగ‌లేదు. చివ‌రికి మాత్రం వ‌రుణ్ సందేశ్ మాట‌ల‌కి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఆ త‌ర్వాత మ‌ళ్ళీ ఇద్ద‌రు చ‌ర్చించుకొని కూల్ అవ్వ‌డంతో డిన్న‌ర్ పార్టీని అంద‌రు క‌లిసి ఎంజాయ్ చేశారు.

Related posts