telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బందోబస్త్” ట్రైలర్ : మన పోలీసులు నీళ్ళూ అందిస్తారు… నిప్పులూ కురిపిస్తారు…

Bandobasth

సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. దేశరక్షణ, వ్యవసాయం, రాజకీయాలతో పాటు పలు సామాజికాంశాల్ని స్పృశిస్తూ ఈ చిత్ర‌ కథ సాగుతుంది. ఎన్‌ఎస్‌జీ కమాండోలు దేశంతో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి కీలక వ్యక్తుల్ని రక్షించే బాధ్యతల్ని తీసుకుంటారు. దేశ రక్షణలోప్రధాన పాత్రను పోషించే కమాండోల బృందాన్ని నడిపించే నాయకుడు చెడ్డవాడైతే ఏం జరుగుతుంది? అలా మారడానికి కారణమేమిటనే పాయింట్‌తో కె.వి.ఆనంద్ చిత్ర క‌థ‌ని రాసుకున్నారు. అలాంటి సంఘటనలే నిజంగా మన దేశంలో జరిగాయి. ఎన్‌ఎస్‌జీ కమాండోల వ్యక్తిగత జీవితం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి అని సూర్య అంటున్నారు. ఈ నెల 20న విడుద‌ల కానున్న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బందోబ‌స్త్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts