telugu navyamedia
సినిమా వార్తలు

58 సంవత్సరాల “శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన చారిత్రాత్మక చిత్రం శ్రీశంభు ఫిల్మ్స్ “శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ” 6-05-1966 విడుదలయ్యింది.

నిర్మాత దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి శ్రీశంభు ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ కళాదర్శకుడు ఏ.కె.శేఖర్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: డి.చౌదరి, కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: యు.రాజగోపాల్, కళ: తోట, నృత్యం: ఏ.కె.చోప్రా, ఎడిటింగ్: ఎం.ఎస్.మణి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, జమున, యస్.వి. రంగారావు, ఛాయాదేవి, రేలంగి , గిరిజ, లింగమూర్తి, ఎల్.విజయలక్ష్మి, బాలయ్య, మిక్కిలినేని, నాగ రాజు,జగ్గారావు, చదలవాడ తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారధ్యంలో జాలువారిన పాటలు హిట్ అయ్యాయి.
“జయహే జయహే,జయ శ్రీకాకుళ దేవా”
“కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా” “వల్లభా ప్రియవల్లభా నాలో వలనే నీలోనూ”
“వసంతగాలికి వలపుల రేగ వరించి”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.

శాతవాహనుల ముఖ్య పట్టణము కృష్ణాజిల్లా లోని శ్రీకాకుళంలో వెలిసిన ఆంద్ర మహావిష్ణు చారిత్రక గాథ ఆధారంగా ఈసినిమా నిర్మించారు.

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలుకేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు (50 రోజులు) జరుపుకున్నది. విజయవాడ దుర్గా కళామందిర్ లో 10 వారాలు ప్రదర్శింపబడింది..

Related posts