telugu navyamedia
రాజకీయ వార్తలు

రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై దాడి ఘటనలో బిభవ్ ను అరెస్టు చేశారు.

సీఎం కేజ్రీవాల్ నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని మాలీవాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అనంతరం స్వాతి మాలీవాల్ కు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వాతి ఎడమ కాలు మీద, కుడి కన్ను కింద గాయం గుర్తులు ఉన్నాయని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. స్వాతి మాలీవాల్ పై బిభవ్ కుమార్ దాడి ఘటన రాజకీయ దుమారం రేపింది.

కేజ్రీవాల్ ఈ ఘటనపై మౌనం వహించడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Related posts