telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అర్చకులు, ఇమాంమ్ లు, పాస్టర్ లకు జగన్ శుభవార్త

cm Jagan tirumala

ఏపీ డెయిరీ డెవలెప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ నిరర్ధక ఆస్తులపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీడీడీసీఎఫ్ ఆస్తులను అమూల్ కు లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కంపెనీకి ఏపీడీడీసీఎఫ్ ద్వారా 69 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. కడపజిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి 66 కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. అలాగే అర్చకుల గౌరవ వేతనం 5 నుంచి 10 వేలకు, ఇమాంమ్ లకు 5 నుంచి 10 వేలకు, ముఅజ్జమ్ లకు 3 వేల నుంచి 5 వేలకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అలాగే పాస్టర్ లకు కూడా 5 నుంచి 10 వేలకు పెంపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 500 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఈ ఆర్థిక సంవత్సరానికి కొనసాగించే నిర్ణయాన్ని ర్యాటిఫై చేయనున్న కేబినెట్.. 176 అదనపు పీహెచ్ సిల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Related posts