తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలైతాల పై తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత కోదండరాం స్పందించారు. సూర్యాపేటలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడు నెలలుగా సరైన పాలన లేదని విమర్శించారు. అందుకే ప్రజలంతా విసిగిపోయారని వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో రాష్ట్రంలో పాలన పడకేసిందని దుయ్యబట్టారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బి.వినోద్ కుమార్ ల ఓటమికి ఆదివాసీలు, రైతుల ఆగ్రహమే కారణమని కోదండరాం పేర్కొన్నారు.
రాహుల్ ప్రధాని కాలేరు..ఏపీకి హోదా ఎలా ఇస్తారు: ఉండవల్లి