telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా మృతదేహాల విషయంలో అపోహలు వద్దు: మంత్రి ఆళ్ల నాని

Alla-Nani minister

కరోనా పరిస్థితులపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కంట్రోల్ సెంటర్ నుంచి జూమ్ యాప్ ద్వారా క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నకొవిడ్ రోగులతో ఆయన మాట్లాడారు. అననతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగుల మృతదేహాలను ఖననం చేసే విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు.

కరోనా మృతదేహాల విషయంలో అపోహలు వద్దని సూచించారు. రోగి మృతదేహంపై 6 గంటల తర్వాత ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు అనేక వైద్య సంస్థలు కూడా తెలిపాయని అన్నారు. కరోనా రోగి దురదృష్టం కొద్దీ మరణించిన పక్షంలో నిర్భయంగా అంతిమ సంస్కారం నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా రోగుల మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. 

Related posts