telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్, బీజేపికి లేదు..

గ్రేటర్‌ ఎన్నికలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ నగర్ లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. 65 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని… కరోనా వచ్చిన, వరద వచ్చిన ప్రజలకు టిఆర్ఎస్ అందుబాటులో ఉండి అందరిని ఆదుకుందని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. పేదలకు, వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారని… కాంగ్రెస్, బీజేపీ పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నాయని ఫైర్‌ అయ్యారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్, బీజేపికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు నగర ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. టిఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీ నగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో వరద సాయాన్ని ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కలికంగా ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Related posts