telugu navyamedia
ఆరోగ్యం తెలంగాణ వార్తలు

ఆగ‌స్టు 31 లోపు ఆక్సీజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి: తెలంగాణ ఆరోగ్య‌శాఖ

తెలంగాణ‌లోని అన్ని ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి త‌గిన మొత్తంలో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించింది. ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌ని ఆసుప‌త్రుల‌కు లైసెన్స్‌ల‌ను రద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించింది. ఆగ‌స్టు 31 వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాల‌ని ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. 200 వ‌ర‌కు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుప‌త్రులు 500 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజ‌న్ జ‌ర‌రేష‌న్ ప్లాంట్లు, 200 నుంచి 500 వ‌ర‌కు బెడ్స్ ఉన్న ప్రైవేట్ ఆసుప‌త్రులు 1000 ఎల్‌పీఎం, 500 కంటే ఎక్కువ బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుప‌త్రుల్లో 2000 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

Related posts