telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అస్సాం అసెంబ్లీ ఎన్నికలో శత్రువులు అయిన మిత్రులు…

ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో అస్సాం ఒక్కటి. అయితే ఇక్కడ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.  మార్చి 27 వ తేదీన తొలిదశ ఎన్నికలు కాగా, మిగతా రెండు దశలు ఏప్రిల్ నెలలో ఉన్నాయి.  మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే, ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధించడానికి పావులు కదుపుతోంది.  ఛత్తీస్ గడ్ లో ఏ విధంగా అయితే సైలెంట్ గా విజయం సాధించిందో అదే విధంగా అస్సాం లో కూడా అధికారంలోకి రావడాలని చూస్తున్నది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైంది.  బీజేపీ 92 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షం అస్సాం గణ పరిషద్ 26 స్థానాల్లో పోటీ చేస్తున్నది.  మిగతా స్థానాల్లో చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి.  ఎన్నికల ముందు వరకు బీజేపీతో కలిసి పనిచేసిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఈసారి బయటకు వచ్చింది.  కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధం అయ్యింది. తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీ నెగ్గలేదని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ అంటోంది.  మూడు విడతలుగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు మే 2 వ తేదీన వస్తాయి. చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts