హాస్య నటుడు అలీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిసిన సంగతి తెలిసిందే. తాను జనసేన పార్టీలో చేరడం లేదని, ఏ పార్టీలో చేరుతానో అతి త్వరలో చెబుతానని అలీ అన్నారు. తనను ఎన్నడూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరాలని కోరలేదని స్పష్టం చేశారు. తన రాజకీయ ఆరంగేట్రం పై ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను అలీ వెల్లడించారు.
తాను టీడీపీ అభిమానినన్న విషయం పవన్ కు తెలుసునని చెప్పారు. సినిమా వేరు, పార్టీ వేరు అని అలీ వ్యాఖ్యానించారు.పవన్ కోరితే జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్ధమని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావించానని పేర్కొన్నారు.
నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు: మంద కృష్ణ