telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు

kaushal

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వెటర్నరీ డాక్టర్ దిశా ఘటనపై ఆయన ఎమోషనల్ అయ్యారు బిగ్ బాస్ ఫేమ్, బీజేపీ నేత కౌశల్ మందా. ఆదివారం నాడు దిశా తల్లిదండ్రుల్ని పరామర్శించిన కౌశల్ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఇందుకోసం పోరాటం చేస్తానన్నారు. ఈ కేసులో ముద్దాయిలకు ఉరిశిక్ష వేసి.. వాటిని టీవీలలో లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి. అప్పుడే భయం ఏర్పడుతుంది. వాళ్లకు జైలు శిక్షవేసినా ప్రయోజనం ఉండదు. బయటకు వచ్చిన తరువాత కూడా మళ్లీ రేప్‌లు చేస్తారు. ఇలాంటి వాళ్లను చంపేయడమే కరెక్ట్. వీళ్లకి వేసిన శిక్షను చూసి ఇలాంటి నేరాలు చేయాలనుకునేవాళ్లలో భయం కలగాలి. అంత భయంకరంగా శిక్షను అమలు చేయాలి. ఈ కేసులో చాలామంది తప్పు ఉంది. మొదటిగా దిశా బైక్ పార్క్ చేయనీయకుండా అడ్డుకున్న టోల్ గేట్ వాళ్లది తప్పు… పెట్రోల్ బంక్ వాళ్లు పెట్రోల్ ఇవ్వడం తప్పు. స్టేషన్‌కి వెళ్తే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? అని కేసును తీసుకోవడానికి లేట్ చేసిన పోలీసులది తప్పు. అమ్మాయిల్ని ఎలా రక్షించుకోవాలని విద్యాసంస్థలలో నేర్పకపోవడం వాళ్లది తప్పు.

శ్రీహిత కేసులో పోరాటం చేశాం.. ఉద్యమాలు చేశాం. అతనికి ఉరిశిక్ష వేశారు.. తరువాత పై కోర్టులో ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. వాడు బయటకు వచ్చిన తరువాత మళ్లీ తప్పు చేయకుండా ఉంటాడా? వాడు ఎంత సైకోనే ఈ ఘటన ద్వారా చూశాం. అలాంటి మానవ మృగాన్ని జనంలోకి తీసుకురావడం అనేది వ్యవస్థలో ఉన్న లోపం. ప్రస్తుత సమాజంలో అమ్మాయి అంటే సెక్స్ టాయ్‌గా చూస్తున్నారు. అమ్మాయి అంటే ఆమెను ఎలాగైనా వాడుకోవచ్చు అనుకుంటున్నారు. పేరెంట్స్ కూడా వాళ్లను భయంతో పెంచుతున్నారు. భయటకు వెళ్లకు అదీ ఇదీ అని చెప్పి వాళ్ళలో భయాన్ని పెంచుతున్నారు తప్ప సమస్య వచ్చినప్పుటు ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం లేదు. ఆడది అంటే ఆదిశక్తి అనే వాళ్లలో ధైర్యం నింపాలి.

నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపి కోర్టుల చుట్టూ తిప్పడం వేస్ట్. వాళ్లను వెంటనే చంపేయాలి. కోర్టు వాళ్లకు ఉరిశిక్ష విధించినా పై కోర్టు మొదట శిక్ష తగ్గిస్తాయి.. తరువాత వదిలిపెట్టేస్థాయి. వరంగల్ శ్రీహిత కేసు ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలకు చట్టంపై ఉన్న నమ్మకం పోతుంది. 14 ఏళ్లు జైలు శిక్ష పడి.. వాళ్లను పందిని మేపినట్టు మేపి తరువాత వదిలిపెట్టేస్తారు. వాళ్లు బయటకు వచ్చిన తరువాత మళ్లీ రేప్‌లు చేస్తారు. శ్రీహిత కేసులో శిక్షపడ్డ నిందితుడు ఆడదాని చీరకనబడితేనే వాసని చూసి పైశాచిక ఆనందం పొందే సైకో. అలాంటి వాడిని వదలిపెడితే మళ్లీ చేయడనే గ్యారంటీ లేదు. రేప్‌, హింసాత్మక ఘటనలకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం. ఖచ్చితంగా వీటి ప్రభావం యువతపై చాలానే ఉంది. సినిమాల్లో రేప్‌లు ఎలా చేయాలి? అమ్మాయిలను ఎలా హింసించాలి?లాంటి వాటినే కాకుండా చట్టం నుండి ఎలా అన్నదానిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై సెన్సార్ బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ కారణంగా నాకు తెలిసి.. వచ్చే రోజుల్లో రేప్ అనేది ఎక్కడైనా జరిగితే నిందితుల్ని చట్టానికి అప్పగించకుండా జనమే కొట్టి చంపేస్తారు. చట్టంపై ఉన్న నమ్మకం పోతుంది. దిశ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు ఆవేశంగా మాట్లాడారు కౌశల్.

Related posts