telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆడదంటే ..అందం ,ఆనందం

ఆడదంటే ..అర్థం, పరమార్థం
ఆడదంటే ..అందం ,ఆనందం
ఆడదంటే ..ఆత్మీయత ,అభిమానం
ఆడదంటే ..అనురాగం ,అనుబంధం
ఆడదంటే ..సహనం ,సంతోషం
ఆడదంటే ..అగాధం ,అంబరం
….చదవాలి గానీ
అంతకు మించిన పుస్తకం ఏదీ ?
…నడవాలి గానీ ..
అంటకు మించిన దారేది ..?
కాకపోతే ..!?
అక్కడక్కడా …
మరకలు ,మచ్చలు,రాళ్ళూ ,ముళ్ళు
అప్పుడప్పుడు ..
గుంతలు ,చెదలు ,చీడలు ,
నిజం సుమీ ..నేనన్నది
నా మాటే నిజం కాకపొతే
నడుస్తున్న చరిత్రని అడుగు ,
సీత ,సావిత్రి ,రజియా ,జిజియా
మా అమ్మ ,మీ అమ్మ ,వాళ్ళ అమ్మ ,
ఆ చరిత్రే ..!
కొన్ని పేజీలలో ..
నీరా రాడియా ,తార చౌదరి ,ధను ,అను
లను కూడా ..చోటిచ్చింది
అవునా ? కాదా ?
అవునంటే …అటు చూడు
అదిగో ..చంద్రుని మీద మచ్చ
ఇది ..అభినవ
మానవేంద్రుని రచ్చ …

Related posts