telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అలర్ట్ : మ‌రో మూడు రోజులు ఊరుములతో కూడిన వ‌ర్షాలు..

నిన్నటి నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసరప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి పశ్చిమ విదర్భ నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు (04,05,06వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు:- రాగల 3 రోజులు (04,05,06వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురగాలులు (గంటకి 30 నుండి 40కిమి వేగంతో ) మరియు వడగండ్లతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు (ముఖ్యముగా ఈ రోజు,రేపు ఉత్తర, మధ్య,దక్షిణ తెలంగాణా జిల్లాలలో) ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి

Related posts