telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సిఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు : దేవినేని

devineni uma disappointed on utsav arrangements

మంగళగిరి సిఐడి కార్యాలయమలో మూడోసారి విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమా హజరయ్యారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని..మళ్లీ మూడో రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈపాటికి నిజాలు తెలిసేవని.. 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేస్తున్నారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే..మాపై తప్పుడు కేసులు పెట్టి విచారణ చేపట్టారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యం మేలుతుంది..విచారణలో అన్ని చెప్పినప్పటికీ కావాలని రోజుల తరబడి విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులు సందర్శించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు .? మీడియా ముందుకు రాకుండా ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారని.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ దూళిపాళ్ల నరేంద్రకు మరియు సంగం డైరి ఎండిని అస్వస్థతకు గురి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులు సందర్శించాలని.. చాణుక్యుడు చెప్పినట్టు పాలకుడు దుర్మార్గుడు అయితే ప్రజలు ఊపిరి అందక చనిపోతారు అన్న విషయం నిజమే అనిపిస్తుందని చురకలు అంటించారు.

Related posts