telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఎస్వీయూ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంకర్లు వీరే!

Sri-Venkateswara-University logo

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పీజీ సెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఎస్వీయూ సెట్ – 2019 ఫలితాలలో కుమ్మరవేలు సుబ్రమణ్యం అవినాక్(63) ఆక్వాకల్చర్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. భీమగుంట్ల హరి చందన(56) రెండో ర్యాంక్ పొందారు. బయోకెమిస్ట్రీలో సిరిగిరి వేంకట శుభ(70) తొలి ర్యాంక్ దక్కించుకోగా, కన్నన్ విఘ్నేశ్(66) ద్వితీయ ర్యాంక్ పొందారు.

బయోటెక్నాలజీలో తోట వినాయక్ కుమార్(66), చెరుకు భరత్ కుమార్ ఆర్(64) తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. బొటనీలో కుంచె రమాదేవి(72), నూతలపాటి ప్రణీత భార్గవి(69) తొలి రెండు స్థానాలు పొందారు. కెమిస్ట్రీలో జెబిటి ప్రశాంత్(68), ఆవల ద్రాక్షాయణి(64) వరుసగా తొలి రెండు ర్యాంకులు సాధించారు. కామర్స్‌లో కాలతురు భాను ప్రకాశ్ రెడ్డి(63), నాగిరెడ్డి శివ కార్తీక్ రెడ్డి(58) ఉన్నారు.

Related posts