telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మరో మూడు రోజులు .. భారీ నుండి అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని సూచనలు..

3 days rain in telugu states

నేడు కూడా కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతి తీవ్ర, అతి భారీ, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. యానాంలోనూ ఇలాగే ఉంటుందని… కోస్తాలో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. గురువారం సైతం భారీ, అతిభారీ వానలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

రానున్న మూడు రోజుల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మంగళవారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడినట్లు స్పష్టత ఇచ్చారు. ఇది బుధవారానికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని, ఆ తర్వాత ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

Related posts