telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రహానే సెంచరీ… వరుణుడి ఆటంకం

భారత్-ఆసీస్ మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య ర‌హానే చెలరేగిపోయాడు.. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఆసీస్‌ను కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ పట్టుసాధించింది.. ఆసీస్‌ జట్టును 195 పరుగులకు ఆలౌట్‌ చేసిన భారత్.. ఆ తర్వాత ఐదు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించి ఆధిక్యాన్ని సాధించింది… వర్షం కారణంగా రెండోరోజు మ్యాచ్‌ రద్దు కాగా.. ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు. ఇక, మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు రహానె.. 195 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. క‌మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 88వ ఓవ‌ర్లో ఫోర్ కొట్టడం ద్వారా ర‌హానే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లను బాదాడు.. ఇక, రహానె కెరీలో ఇది 12 సెంచరీ కావడం మరో విశేషం.. మరోవైపు.. ఆల్‌రౌండ‌ర్ రవీంద్ర జ‌డేజాతో క‌లిసి ఆరో వికెట్‌కు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పాడు రహానె. రెండో రోజు 91.3 ఓవర్ల దగ్గర వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా.. ఐదు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి.. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా..  రహానె 200 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో నాటౌట్‌గా నిలవగా… 104 బంతులు ఎదుర్కొన్న జడేజా 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.  చూడాలి మరి రేపు ఏం అవుతుంది అనేది.

Related posts