telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జులై 16న రానున్న కేజీఎఫ్-2…

kgf

కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టి అందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా పొందిన ఆదరణ కూడా అంతా ఇంతా కాదు. దాంతో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయి డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. అదేవిధంగా హీరో యష్‌ కూడా పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సౌత్ కంటే నార్త్ లో భారీ హిట్ ను అందుకుంది.  కేజీఎఫ్ సినిమా సమయంలోనే సెకండ్ చాఫ్టర్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  కరోనా సమయంలో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.  కాగా, ఇప్పుడు సినిమాకు రిలీజ్ డేట్ ను యూనిట్ అనౌన్స్ చేసింది.  జులై 16 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా యూనిట్ తెలియజేసింది.  సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో కేజీఎఫ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీలో యశ్ తో పాటుగా బాలీవుట్ తారాగణం కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

Related posts