జమ్మూకశ్మీర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆర్టికల్ 370 రద్దుపై విద్యార్థులకు వివరిస్తున్న ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది. రాంబన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రత్తిని కల్పించే ఆర్టికల్ 370 గురించి ఉపాధ్యాయుడు వివరిస్తూ.. రద్దును సమర్థించారు. ప్రభుత్వం సరైన పద్ధతిలోనే దీనిని రద్దు చేసిందని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులుకు వివరించారు.ఇది విన్న కొందరు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై దాడికి దిగారు.
దీంతో వారి బారి నుంచి తప్పించుకున్న ఆయన ఫస్ట్‌ఫ్లోర్‌లోని క్లాస్ రూము నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఆయనను అడ్డగించిన విద్యార్థులు పై నుంచి కిందికి తోసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇతర ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమైన ఆయనను ఓ గదిలోకి నెట్టి విద్యార్థుల బారి నుంచి కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూలుకు చేరుకుని ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.