తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేస్ కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం గాంధీ మెడికల్ కాలేజీలో వైరాలజీ లాబ్‌ఆయన పరిశీలించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీలో లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందుతున్నాయి.
“కరోనా ” ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. గత 10 రోజులుగా కరోనా టెస్ట్‌లను పూణెకు పంపుతున్నాం. కానీ, ఇప్పుడు గాంధీలోనే టెస్ట్‌లు ప్రారంభించామని తెలిపారు. గంటల్లోనే రిజల్ట్ వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల టెస్టులు గాంధీలోనే చేస్తామన్నారు. కేంద్రం కిట్స్ పంపిందని, లాబ్‌లో కిట్స్, మ్యాన్ పవర్ అన్నీ అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు.
చంద్రబాబు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు: విజయసాయిరెడ్డి