telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖలో ఐటీకి ఊతం ఇచ్చే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు…

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే జగన్ మాత్రం వారిపైన కాకుండా విశాఖ పై ఫోకస్ పెట్టాడు. విశాఖలో ఐటీకి ఊతం ఇచ్చే విధంగా పలు నిర్ణయాలు తీసుకుంది జగన్ సర్కార్. విశాఖ లో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్ ‌లో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసు, స్టేట్‌ డేటా సెంటర్, ఐటీ టవర్స్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నారు. రోబోటిక్స్, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌ మరియు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధనలకు ఈ యూనివర్సిటీ కేంద్రం కానుంది. విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీల నిర్మాణం చేపట్టనున్నారు. కనీసం 2 వేల ఎకరాల విస్తరణంలో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. చూడాలి మరి ఇవి ఎప్పటికి పూర్తవుతాయి అనేది.

Related posts