కరోనా లాక్ డౌన్ అనంతరం టీటీడీలో కఠిన నియమాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రధసప్తమి ఉత్సవాలను తిలకించెందుకు భక్తులను మాడ వీధులలోకి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రధసప్తమి ఏర్పాట్ల పై టీటీడీ అధికారులతో స్థానిక అన్నమయ్య భవన్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన చైర్మన్ సుబ్బారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రధసప్తమి నాడు దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను వాహన సేవల దర్శనానికి అనుమతిస్తామని అన్నారు.. కరోనా ఆంక్షలు నేపథ్యంలో చక్రస్నానాన్ని మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. కరోనా ప్రభావం తగ్గుతూ వుండడంతో దర్శనాల పెంపు పై కూడా సమీక్ష నిర్వహించామని మార్చి నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించామని ఐతే గతంలోలా కాకుండా కరోనా నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తామన్నారు. ఇక ఈ నెల 13వ తేదీన చెన్నైలోని టీనగర్ లో పద్మావతి అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన చేస్తామన్నారు ఆయన. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post