telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పంట నష్టంపై మంత్రి హరీష్ రావు సమీక్ష

Harish Rao TRS

సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతిని ఇవాళ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఐదు గేట్లు ఎత్తి నీటిని నిజాంసాగార్ డ్యాంకు వదులుతున్న అధికారులు..కర్ణాటకలో కారింజ ప్రాజెక్టు నుండి సింగూరుకు 12062 క్యూసెక్కుల వరద వస్తుంది. ఇన్ ఫ్లో 34097 క్యూసెక్కులుగా ఉండగా..ఔట్ ఫ్లో 37288 క్యూసెక్కులుగా ఉంది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 28.224 టిఎంసిలు కాగా..పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టిఎంసిలుగా ఉంది. వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు…పంట నష్టంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ… కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయన్నారు.

సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్టు కింద ఉన్న 170 చెరువుల్లో 100 చెరువులను ప్రాజెక్టు నీటితో నింపుతామని హామీ ఇచ్చారు. R&B అధికారులను సంప్రదించి వర్షాలకు దెబ్బతిన్న 144 కి.మీ ల రోడ్లకు 130 కోట్లతో మరమ్మతులు చేపడుతామని పేర్కొన్నారు. బ్రిడ్జిలు, 42 కల్వట్లకు 45 కోట్ల రూపాయల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఆందోల్,నారాయణఖేడ్ ,జహీరాబాద్ ప్రాంతాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి.వీటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించామన్నారు.  వ్యవసాయ శాఖకు సంబంధించి జరిగిన పంట నష్టం గురించి రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంట వివరాలు ఆడిగి తెలుసుకోవాలని తెలిపారు. యాసంగిలో సింగూరు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు 40 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు.

Related posts