telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

soniya rahul

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చట్టాలపై ఓ కమిటీని కూడా సుప్రీం కోర్టు వేసింది. అయితే… రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాల పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుకోండి..వ్యవసాయ చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందని రాహుల్‌ పేర్కొన్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తల కోసం…. రైతులకు కేంద్రం ద్రోహం చేస్తోందని మండిపడ్డారు రాహుల్‌ గాంధీ. అటు తమిళనాడు సంస్కృతిపై కూడా రాహుల్‌ గాంధీ స్పందించారు. దేశ భవిష్యత్తుకు తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్ర ఎంతో అవసరమని… అందుకే తమిళనాడుకు వచ్చానని పేర్కొన్నారు. తమిళ ప్రజలతో కఠినంగా వ్యహరించి, వారి సంస్కృతిని పక్కన పెట్టేయగలమని భావించే వారికి ఓ సందేశం ఇవ్వడానికే వచ్చానని రాహుల్‌ స్పష్టం చేశారు.

Related posts