telugu navyamedia
రాజకీయ

బాలకోట్ మీదనే ఎందుకు దాడి జరిగిందో తెలుసా ?

Balakot, Pak Attack
భారత వాయుసేన మంగళవారం నాడు  సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్లో కి వెళ్లి ఉగ్రవాదులను తుదముట్టించింది .ఈ వార్త ఇప్పుడు భారతీయుల్లో చెప్పలేని సంతోశాన్ని కలిగిస్తుంది . ఫిబ్రవరి 14న శ్రీనగర్ లోని పుల్వామా లో భారత సైనికులపై జైషే మహమ్మద్  ఉగ్రవాద సంస్థ మానవ బాంబు ను ప్రయోగించి 42 మంది మృతికి కారణమైంది . ఈ అమానుషమైన దాడి మేమె చేశామని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించుకుంది . 
Balakot, Pak Attack
అప్పటి నుంచి ప్రతీకారం కోసం భారత బలగాలు అవకాశం కోసం చూస్తున్నాయి . ప్రధాని మోడీ కూడా భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు . గత  వారం రోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో దాక్కున్న ఉగ్ర మూకలను ఏరివేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశారు . న్యూఢిల్లీ , శ్రీనగర్ లో అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి . బలగాలను కూడా సరిహద్దుకు తరలించారు . 
Indian-air-Force
ఈ విషయం తెలుసుకున్న జైషే  మహ్మద్ ఉగ్ర వాద సంస్థ  తమపై భారత్ వాయుసేన ఏ  క్షణంలో నైనా మెరుపు దాడి చెయ్యవచ్చునని గ్రహించింది . అందుకే భారత వాయుసేనకు ఆచూకీ దొరక్కుండా తమ క్యాంపు ను సురక్షితమైన ప్రాంతాన్ని తరలించాలని  అనుకుంది . బాలకోట్ లో వున్న దట్టమైన అడవి , ఎతైన పర్వతం పై వున్న ఒక  రిసార్టుకు క్యాంప్ ను తరలించింది . అది అత్యంత సురక్షితమని వారు భావించారు . 
Pakistan Pulvama attack says NIA
ఈ రిసార్ట్ ను భారత్  వాయుసేన పసికట్టలేదని వారు భావించారు . ఈ రిసార్ట్ లో దాదాపు 700 మంది కి కావలసిన సర్వ సదుపాయాలున్నాయి . ఇక్కడ జైషే  మహ్మద్ ఉగ్రవాదులు 325 మంది 25 మంది ఉగ్రవాదులుగా శిక్షణ తీసుకుంటున్న  వారున్నారు . అయితే భారత గూఢచారి వ్యవస్త,  ఉగ్ర సంస్త  ఎక్కడ నుంచి ఎక్కడికి మార్చిందో  పక్కా సమాచారంతో వుంది . వారి కదలికలపై నిఘా పెట్టింది . 
pulvama attact conductor still in kashmir
అందుకే  ఉగ్రవాదులు ఆదమరచి నిద్రపోతున్న వేళ  బాలకోట్  రిసార్ట్ మీద మెరుపు దాడి చేసింది . నిద్రలో  వున్న 350 మంది దుర్మరణం పాలయ్యారు . ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్  బావమరిది మౌలానా యూసుఫ్  అజార్ కూడా మరణించినట్టు తెలిసింది .జైషే మహమ్మద్ లో వున్నా సీనియర్ కమేండర్లు కూడా ఖతమయ్యారని పక్కా సమాచారం వుంది . 
terrorist firings in pulvama in kashmir
అటు పాకిస్తాన్ ఇంటెలిజెంట్  వర్గాలు కూడా భారత్  దాడిని పసికట్టలేకపోయారు .  పాకిస్తాన్ భూభాగం లోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుపెట్టడం భారత్  సాధించిన గొప్ప విజయం . పాకిస్తాన్  ఊహించని మెరుపు దాడి . భారత  సైన్యం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసివచ్చింది . జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కు చావు దెబ్బ .  ఉగ్ర కార్య కలాపాలతో ప్రపంచాన్ని పెను సవాలుగా వున్న ఈ సంస్ధ కిది తేరుకోలేని దెబ్బ .  శత్రువు ఎక్కడ దాక్కున్నాడో  తెలుసుకుని మట్టు  పెట్టడం భారత సైన్య  ప్రతిభకు  నిదర్శనము . 
-భగీరథ 

Related posts