telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భూముల రికార్డులపై చట్టసవరణ.. ఏపీ క్యాబినెట్ లో పలు కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం అమరావతిలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాలకు క్యాబినెట్ ఆమోదం పలికింది.

భూముల రికార్డులపై క్యాబినెట్‌ చట్టసవరణనకు క్యాబినెట్‌ పచ్చజెండా ఊపింది. ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదం తెలిపింది. మద్య నిషేధం దిశగా తొలిఅడుగు వేసింది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:
-అక్వా రైతుల నుంచి యూనిట్ విద్యుత్ కు రూ. 1.50 మాత్రమే వసూలు
-మద్య నిషేధం దిశగా తొలి దశ చర్యలు.. ఇకపై మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వానిదే
-అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500, మిని అంగన్ వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్ వాడీ హెల్సర్ కు రూ.7వేల వేతనం
-ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కుకోసం చిత్తూరు జిల్లాలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగింత
– గ్రామ వాలంటీర్ల కు నెలకు రూ.5వేల వేతనం
-జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం.
-ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
-1,33,867 ఉద్యోగాలను త్వరలోనే నోటిఫికేషన్.
-కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు

Related posts