telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆస్తులన్నీ ఉగ్రవాదుల కోసమే ఖర్చుపెట్టిన పాక్.. అందుకే ప్రస్తుతం దివాళా స్థితిలో..

pak pm imran actions on ex pm and

పాక్ ఇప్పటివరకూ తమదేశంలో అసలు తీవ్రవాదులు లేరనే చెప్పుకుంటూ వచ్చింది. కానీ నిజం నిప్పులాంటిదని, అది ఎలాగైనా బయటకు వస్తుందని మరోసారి రుజువైంది. స్వయంగా పాక్ అధికారే తమదేశంలో ఉగ్రవాదులు ఉన్నట్టు స్పష్టం చేశాడు. దీనితో ఉగ్రవాదులను పాక్ ప్రోత్సహిస్తుందని, పాక్ లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్‌తో పాటు పలు ఇతర దేశాలు కూడ ఆరోపణలు నిజం అయ్యాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం భారత్ పలుసార్లు వెల్లడించింది. తాజాగా భారత్ చెబుతున్నట్టుగా పాక్ లోని ఉగ్రవాద సంస్థల ప్రతినిధులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు కోట్ల రుపాయాల నిధులు ఖర్చుపెట్టామని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి రిటైర్డ్ బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మాద్ షా అక్కడి ప్రైవేట్ మీడీయాకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించాడు. దీంతో పాక్ లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించినట్టైంది. ఈ ఇంటర్యూలో ఉగ్రవాదులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఆయన వెల్లడించాడు. ఈనేపథ్యంలోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన హఫీజ్ సయిద్ నిర్వహిస్తున్న జమాత్ ఉద్ దవా సంస్థ సభ్యులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు వందల కోట్ల రుపాయల నిధులను పాక్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

దీనితో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై షా పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ తమ దేశాన్ని నాశనం చేస్తున్నాడని ఆయన అన్నాడు. పాక్ ను పాలిస్తున్న తీరుతో దేశం భ్రష్టు పడుతోందని ఆయన విమర్శించారు. 2008లో ముంబాయిలో ఉగ్రదాడులకు నేతృత్వం వహించిన దాడులకు సూత్రదారిగా వ్యవహరించిన జమాత్ ఉద్ దవా హఫీజ్ సయిద్‌ను పాక్ అధికారులు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై జూలై 17 న అరెస్టు చేశారు. లాహూర్‌లోని హై సెక్యూరిటి మధ్య గల లఖ్‌పత్ జేలులో ఉంచారు. అంతకుముందు జూలైలో తొలి అమెరికా పర్యటన సందర్భంగా, పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశంలో 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నట్లు తెలిపారు. వీరంతా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడారని చెప్పుకొచ్చారు. ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్‌ తమ సరిహద్దుల్లో 40 వేర్వేరు మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే.

Related posts