telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత బర్త్ డేకి నాగ చైతన్య స్పెషల్ గిఫ్ట్

samantha and chaitu again with another movie

పెళ్లి చేసుకున్నాక కూడా గ్లామర్ ఒలకబోయడంలో ఏ మాత్రం వెనకాడకుండా వరుస హిట్లతో దూసుకెళ్తోంది అక్కినేని కోడలు సమంత. సమంత నేడు (ఏప్రిల్ 28) తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భార్య సమంత కోసం నాగచైతన్య సొంతంగా ఇంట్లోనే కేకు రెడీ చేసి ఆమెతో కట్ చేయించారు. ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సమంత. మొదటి సినిమా ‘ఏమాయ చేశావే’ సినిమాలో నాగచైతన్యతోనే ప్రేమలో పడ్డ ఆమె చాలాఏళ్లు ఆయనతో ప్రేమాయణం కొనసాగించి చివరకు అక్కినేని కోడలు అయింది. దీంతో ఇక సమంత సినిమాలు చేయదని అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ ‘రంగస్థలం’లో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసి భారీ హిట్ ఖాతాలో వేసుకుంది.

పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కూడా మరోసారి తెరమీద ‘మజిలీ’ రూపంలో మాయ చేసింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా‌ ‘ఓ బేబి’ సినిమాతో తాను సోలోగా మెప్పించింది. చివరగా శర్వానంద్‌‌తో కలిసి ‘జాను’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనుందని తెలుస్తోంది. గ్లామర్ హీరోయిన్ గానే కాదు మంచి మనసున్న అమ్మాయిగా కూడా సమంత భేష్ అనిపించుకుంటోంది. సామాజిక కోణంలో ఆలోచించి సాటిమనిషికి సాయపడాలనే దృక్పథంతో ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ. ‘ప్రత్యూష సపోర్ట్’ అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించి బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది అక్కినేని కోడలు సమంత.

 

View this post on Instagram

 

Family ❤️ …. (no points for guessing what I am praying for )

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts