telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదు: ట్రంప్

trump usa

అమెరికా అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. నవంబర్ మాసంలోనే ఎన్నికలు జరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే విషయాన్ని ఆలోచించాలని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న అభ్యర్థి జో బైడెన్ కోరారు.

 మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఎన్నికలపై సమాధానం ఇచ్చారు. కరోనా నేపథ్యంలో కూడా ఎన్నికల తేదీల్లో మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. నవంబర్ మూడో తేదీనే ఎన్నికలు జరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు.

Related posts