telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వరద బాధితుల కన్నీటి కష్టాలు

వరదలతో వణికిపోయిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యంగా చాదర్ ఘాట్.ముసా నగర్.శంకర్ నగర్.రసూల్ పురా. భూలక్ష్మి మాత వెనుక బస్తీ. ఇతర పరివాహక ప్రాంతాలలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. బస్తీలు నామ రూపాలు లేకుండా పోయాయి. రెండు రోజుల తర్వాత వరద తగ్గముఖం పట్టడంతో.. ప్రాణ భయంతో సర్వస్వం వదిలి పిల్ల పాపాలతో బయటకు వెళ్లిన భాధితులు ఇప్పుడిప్పుడే నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు బురదమయంగా మారిపోయిన ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరదలతో సర్వస్వం కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తి లలో వీధులన్నీ బురదమయం. ఇళ్లన్నీ వరదలతో జరిగిన నష్టానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. ఇళ్లకు చేరుకున్న బాధితులు బురదమయమైన తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లో చిందరవందగా పడిపోయిన వస్తువుల్ని సర్దుకుంటున్నారు. పాపం ఎక్కడ చూసిన మూసి పరివాహక బస్తీలలో వరద బాధితుల కన్నీట కష్టాలే కనిపిస్తున్నాయి.. రెండు రోజులుగా పస్థులు తో ఉన్నా తమను ఎవరు పట్టించుకోలేదని భాదితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బస్తీలలో వెంటనే విద్యుత్.నీటి సరఫరా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మురికి.బురద మయంగా బస్తీలలో గ్రేటర్ అధికారులు.వైద్య సిబ్బంది శానిటేషన్ స్పెషల్ డ్రైవ్.వైద్య శిబిరాలు నిర్వహించి అంటు రోగాల నుంచీ కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.

Related posts