telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపటి మంత్రివర్గ సమావేశం లో .. ఆర్టీసీ భవితవ్యం..

kcr stand on earlier warning to rtc employees

రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కార్మికులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. కార్మిక న్యాయస్థానంలో తేల్చుకుంటారా? కార్మిక శాఖ కమిషనర్‌ స్థాయిలోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారా? కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా? 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇస్తారా? సమస్య పరిష్కారానికి ఎలాంటి ముగింపు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీలో సగం బస్సులే ఉండేలా 5100 ప్రైవేటు బస్సులకు రవాణా అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. విధివిధానాల రూపకల్పన, ఇతర బాధ్యతలను రవాణాశాఖకు అప్పగించింది.

5100 రూట్ల ప్రైవేటీకరణ చట్టవిరుద్ధమని టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. దీంతో కేబినెట్‌ నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా ఎంపిక చేసిన మార్గాలపై త్వరలో నోటిఫికేషన్‌ కూడా జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్షణ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ”ఆర్టీసీ సమస్యను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి సీఎం కేసీఆర్‌కు కొన్ని సూచనలు వెళ్లాయి. రేపు జరిగే మంత్రివర్గ భేటీలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే నిర్ణయం తీసుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదు” అని లక్ష్మణ్‌ తెలిపారు.

Related posts