మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి ఇవాళ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తునదని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం పిటిషన్ పెట్టుకున్నారు. కేసు దర్యాప్తు ఆరంభదశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం వల్ల ఆ కేసు విచారణ మందగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్థిక నేరాలు భిన్నమైనవని, వాటిని దర్యాప్తు చేసేందుకు పద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయని కోర్టు చెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇప్పటికే చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.