telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వైరస్ సోకిన వారిని గుర్తించాలి..లాక్ డౌన్ తో ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్ఓ

mike ran w h o

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలుగు రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ ప్రకటించాయి. దేశాలకు దేశాలే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. అయితే లాక్ డౌన్ ప్రకటించినంత మాత్రాన కరోనాను నియంత్రించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హైరిస్క్ నిపుణుడు మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.

కరోన పోరాటంలో విజయం సాధించాలంటే మొదట వైరస్ సోకిన వారిని, అనారోగ్యంపాలైన వారిని గుర్తించాలని సూచించారు. ఆపై వారందరినీ ఐసోలేషన్ కు తరలించి, వారు కలిసిన వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచాలని వివరించారు. అంతేతప్ప, వైరస్ సోకిన వారిని గుర్తించకుండా లాక్ డౌన్ ప్రకటిస్తే ఫలితం ఉండదని స్పష్టం చేశారు.

Related posts