telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫొటోలు దిగడం తప్ప పోలవరంకు చంద్రబాబు ఏమీ చేయలేదు: అనిల్ కుమార్ యాదవ్

Anil kumar jadav minister

పోలవరం ప్రాజెక్టు వద్ద ఫొటోలు దిగడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వద్దకు జనాలను తీసుకెళ్లి భజన చేయించుకున్నారని విమర్శించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని అనిల్ చెప్పారు. వైయస్ హయాంలోను కాలువలు తవ్వారని గుర్తు చేశారు. అప్పుడు కాలువలు తవ్వకపోయి ఉంటే భూసేకరణకు వేల కోట్ల రూపాయల భారం పడేదని తెలిపారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని పేర్కొన్నారు.

Related posts