telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశానికి దేవుడు అన్ని ఇచ్చారు.. వాటితో పాటు చైనా, పాకిస్తాన్ లను కూడా

చైనా అతి పెద్ద పోటీదారు ఇండియా అని.. అందుకే ఇండియాని ఆపేందుకు చైనా విశ్వ ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ అన్నారు. ఇండో చైనా స్టాండ్ ఆఫ్ ద రోడ్ ఎహెడ్ అనే అంశంపై ఇవాళ రామ్ మాధవ్ ప్రసంగించారు. తల్లి దండ్రులను, పొరుగు వాళ్ళను మనము ఎంపిక చేసుకోలేమని.. భారత దేశానికి దేవుడు అన్ని ఇచ్చారు.. వాటితో పాటు పొరుగు దేశాలుగా చైనా, పాకిస్తాన్ లను కూడా ఇచ్చాడని తెలిపారు. ఆక్రమణలు చేయడం చైనా స్వభావమని…గల్వన్ లో భారత సైనికులు గట్టిగా నిల్చున్నారు.. వెనక్కి వెళ్లాలని చైనా కి గట్టిగా చెబుతున్నామన్నారు. చైనా స్వభావాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. పాకిస్థాన్, చైనా కి భూదానం చేసిన వారు ఈ రోజు మోడీ ని ప్రశ్నిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇప్పటి వరకు వాస్తవదీన రేఖని నిర్దారించలేదని.. దేశ భద్రత విషయంలో అందరం ఒక్క తాటి పై ఉండాలని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం LAC కోసం పట్టుబడుతుందని.. రెండు దేశాలు కలిసి త్వరలోనే పరిష్కారానికి వస్తాయని వెల్లడించారు. ప్రధానిగా పీవీ నర్సింహ రావు ఉన్నప్పుడు చైనా వెళ్ళాడు అప్పుడు జరిగిన ఒప్పందం లో lacపై పట్టుబట్టలేదని గుర్తు చేశారు. ప్రపంచానికి చైనా రెండు సవాళ్లు విసురుతోందని…. ఆర్థికంగా బలోపేతం అయ్యి దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటుందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తుందని.. ఈ రెండు విషయాల్లో ఇండియా బలోపేతం కావాల్సి ఉందని స్పష్టం చేశారు. చైనా నేతలది యుద్ధ మనస్తత్వమని పేర్కొన్నారు.

Related posts