telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చంద్రబాబు, వైఎస్ఆర్ పై సినిమా… పోస్టర్ విడుదల చేసిన దేవాకట్టా

Indraprastham

ఎమోషన్, కామెడీ, రొమాన్స్ ఈ మూడింటిని త‌న‌దైన మార్క్ తో తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో దేవాకి ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. తాజాగా తన తర్వాత సినిమా అప్డేట్ ఇదే అంటూ ‘ఇంద్రప్రస్థం’ అనే సినిమా పోస్టర్ ను విడుదల చేశారు దేవాకట్టా. అయితే ఆ పోస్టర్ పై ఉన్నది ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.1980 నుండి 2000 సంవ‌త్సరాల మ‌ధ్య చంద్రబాబు, వై.ఎస్‌.ఆర్ ల మధ్య ప్రయాణం ఎలా సాగింది ? అనే అంశాల పైన ఈ సినిమా సాగనుంది అని తెలుస్తోంది..`నైతికత మారుతుంది. అధికారం కోసం జరిగే యుద్ధం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది` అని పోస్టర్‌ ఉన్న కొటేషన్‌ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రొడోస్‌ ప్రొడక్షన్స్ పతాకంపై హర్ష వీ, తేజ సీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహంపై తాను ఒక కథ సిద్దం చేసుకోవడంతోపాటు ఆ స్క్రిప్ట్‌ ను రిజిస్టర్‌ కూడా చేసుకున్నానని, ఇపుడు ఇదే కథ ఆధారంగా డైరెక్టర్‌ రాజ్‌ వెబ్‌సిరీస్‌ తీస్తున్నారని దేవాకట్టా మండిపడిన విషయం తెలిసిందే.

Related posts