telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంక్షేమ పథకాల వల్లే ఘన విజయం: కేటీఆర్

ktr trs president

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 2014 నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ప్రకటించారు. పురపాలక మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని ఆయన పేర్కొన్నారు.

ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజానీకానికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ రోజు ఉదయమే తెలంగాణ భవన్‌కి కేటీఆర్ చేరుకున్నారు. పోలింగ్ సరళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

Related posts