telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల…

eetela sudden visit to karimnagar govt hospital

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ – 53 వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అక్కడ ఆయన మాట్లాడుతూ… సమాజం జీనోమ్ ఎరా లో ఉంది, ప్రపంచం పురోగమనం లో ఉంది. కానీ ఒక్క అంశంలో తిరోగమనంలో ఉన్నాము. అందుకే వినకూడని, చూడకూడని సమస్యలు చూస్తున్నాం. మానవ జన్మ ఇంత అధ్వాన్నమా అన్న పరిస్థితికి వచ్చింది. మనిషి మానసిక స్థితిని అంచనా వేయడానికి సరిపోయేంత మంది మానసిక వైద్య నిపునులు లేరు. mదిశ నిర్భయ లాంటి సంఘటనలు మానవ సమాజం ను కదిలించి వేస్తున్నాయి. మనిషికి ఆస్తులు ఉన్నాయి. కానీ తృప్తి లేదు. ప్రతి మనిషిలోనూ టెన్షన్ ఉంది.

అమెరికాలో గన్ తో పదుల మందిని చంపినా, మన దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసిన సంఘటనలు మనిషి మానసిక స్థితిని చెప్తున్నాయి. రోగాలను నిర్ధారణకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ జబ్బుకు కారణం అవుతున్న మానసిక స్థితిని అంచనా వేయలేక పోతున్నాం. అలా చేస్తే ఎంతో డబ్బును ఆదా చేయవచ్చు, ప్రాణాపాయం నుండి బయటపడవేయవచ్చు. సమాజం అభివృద్ధి తో సమానంగా మానసిక వైద్య నిపుణుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. మానసిక రోగులు ఇతరుల మరణాలకు కారణం అవుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో మానసిక వైద్య నిపుణుల, నర్సులు నియమిస్తం. పేషంట్ కి ట్రీట్మెంట్ అంటే మందులు మాత్రమే కాదు, కౌన్సిలింగ్ కూడా అవసరం. ప్రతి ఆసుపత్రిలో పేషంట్ కౌన్సిలర్ ఉండాలి అని ప్రతిపాదించినం. టెన్షన్ ను పోగెట్టే శక్తి రాజకీయ వ్యవస్థ కి ఉంది. వారితో పాటు మానసిక వైద్య నిపుణుల అవసరం ఉంది. ఇప్పుడు చాలా మెడికల్ కాలేజి లో సైకియాట్రీ PG సీట్లను తెచ్చుకున్నాం. భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటాము. తెలంగాణ అనేక అంశాల్లో దేశానికి దిక్సూచి గా ఉంది. త్వరలో ఆరోగ్య విషయంలో కూడా మనం ముందుంటాం. భారతీయ సమాజం లో ఉన్న మానవ విలువలు మనల్ని కాపాడుతున్నాయి అని ఈటల అన్నారు.

Related posts