టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఐదోసారి అద్దంకి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన రవికుమార్, 2024 ఎన్నికల్లోనూ తన విజయ ఢంకా మోగించాలని
రంగంలోకి దిగారు
2004: మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలుత రాజకీయ ప్రవేశం చేసి పెద్దనాన్న గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు నర్సయ్యపై సుమారు 13,800 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.
2009: అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై సుమారు 15,700 ఓట్ల మెజార్టీతో మరోసారి విజయం సాధించారు.
2014: వైసీపీ తరపున కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు వెంకటే్‌షపై పోటీ చేసి సుమారు 4 వేల కుపైగా మెజార్టీతో గెలుపొందారు.
2019: టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లి 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ ఆర్థికమూలాల పై దెబ్బకొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు
2024 ఎన్నికలలో అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్‌ను తొలి జాబితా లోనే ప్రకటించారు. రుసగా నాలుగు సార్లు విజయ ఢంకా మోగించిన గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ అనుకూల పవనాలలో భారీ మెజార్టీ ఖాయం అని టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.
గొట్టిపాటి రవికుమార్ బయోడేటా:
పుట్టిన తేది: 9-11-1973
విద్యార్హతలు: బీటెక్ (డిస్‌కంటిన్యూ)
స్వగ్రామం: యద్దనపూడి
నివాసం: చిలకలూరిపేట
తల్లిదండ్రులు: డాక్టర్ శేషగిరిరావు, జయంతిమాల
భార్య: ఝాన్సీ
కుమారులు: హర్షవర్దన్, మహేష్ బాబు
2024 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ గెలిచి చరిత్ర సృష్టిస్తారా లేదా అనేది వేచి చూడాలి.